ETV Bharat / state

మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు సారూ..!

author img

By

Published : Aug 24, 2020, 12:31 AM IST

కరోనాతో చనిపోయిన మహిళ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేసిన తమను ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. అంత్యక్రియలు నిర్వహించిన తామంతా ఐసోలేషన్​లో ఉంటున్నామని... తమలో ఒకరికి ఆరోగ్యం బాగోకున్న ఎవ్వరూ స్పందించడంలేదని ఆందోళన పడుతున్నారు. ఈ ఘటన మెదక్​ జిల్లా కొల్చారం మండలంలో చోటు చేసుకుంది.

corona patients worried about treatment in medak
మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదు సారూ..!

మెదక్​ జిల్లా కొల్చారం మండలం కొంగోడులో ఓ మహిళ కరోనాతో ప్రాణాలు కోల్పోయింది. ఆమె అంత్యక్రియలు నిర్వహించడానికి సహకరించి.. ఏర్పాట్లు చేసిన ఏడుగురికి కూడా కరోనా వచ్చిందన్న అనుమానంతో వారిని గ్రామ శివారులోని ప్రభుత్వ పాఠశాల గదిలో ఐసోలేషన్​లో ఉంచారు. గ్రామ రెవెన్యూ సహాయకుడు దుబ్బగాళ్ల స్వామి వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. ఈ పరిస్థితుల్లో అతనికి చికిత్స అందించడానికి ఎవరూ ముందుకు రాలేదు.

గత రెండు రోజులుగా వారికి సరైన ఆహారం కూడా ఇవ్వడం లేదని, గ్రామ పెద్దలు, వైద్యసిబ్బంది ఎవరూ తమను పట్టించుకోవడం లేదని ఐసోలేషన్​లో ఉన్న ఏడుగురు వ్యక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమలో ఒకరు అస్వస్థతకు గురికావడం వల్ల తమకు కూడా ఏమవుతుందోనని ఆందోళన పడుతున్నారు. అధికారులు స్పందించి తమకు సరైన ఆహారం అందించాలని, పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని కోరుతున్నారు.

ఇదీ చూడండి: గణేషుడికీ ఓ పార్కు, మ్యూజియం ఉన్నాయి.. అవి ఎక్కడో తెలుసా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.