ఆడుకుంటున్న చిన్నారిపై వీధి కుక్క దాడి - సీసీటీవీ విజువల్స్ వైరల్ - DOG ATTACKS IN NIZAMABAD TOWN - DOG ATTACKS IN NIZAMABAD TOWN
🎬 Watch Now: Feature Video
Published : Oct 3, 2024, 1:03 PM IST
Dog Attack in Nizamabad : నిజామాబాద్ నగరంలో రోజురోజుకూ వీధి కుక్కలు పిల్లలపై విచక్షణా రహితంగా దాడులు చేస్తున్నాయి. నగరంలోని కోటగల్లి మైసమ్మ వీధిలో బుధవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడేళ్ల చిన్నారిపై ఓ వీధి కుక్క ఒక్కసారిగా మీద పడి తీవ్రంగా దాడి చేసింది. వీధి కుక్క దాడి చేసిన దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాలో నమోదు అయ్యాయి. గాయపడిన చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారి ముఖంపైనా గాయాలయ్యాయి. వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు.
తెలంగాణలో గత కొంతకాలం నుంచి వీధి కుక్కల బెడద తీవ్రమైన అంశంగా మారింది. కుక్కల దాడిలో ఎన్నో చిన్ని చిన్ని ప్రాణాలు బలైపోయాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా మంది కుక్క కాటుకు గురయ్యారు. ప్రభుత్వాసుపత్రుల్లో కుక్క కాటుకు వైద్యం కోసం రోజూ చాలా మంది ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు పరిస్థితి ఇలాగే ఉంది. ప్రభుత్వం, అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.