ETV Bharat / politics

''గంగ'కు రూ.17 కోట్లు, మూసీకి రూ.2700 కోట్లా? - ఇది బ్యూటిఫికేషన్​ కాదు, లూటిఫికేషన్'​ - KTR SLAMS THE TG GOVT - KTR SLAMS THE TG GOVT

KTR Slams The TG Govt : హైదరాబాద్​ నగరంలోని మూసీ నదిని సుందరీకరించడం కోసం ప్రభుత్వం సంకల్పించిన విషయం తెలిసిందే. రివర్​ బెడ్​లో ఉన్న పేదలకు డబుల్​ బెడ్​ రూమ్​ ఇల్లు కేటాయించి, వారికి రూ.25 వేలు ప్రకటించడం పట్ల బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిండెంట్​ కేటీఆర్ ఎక్స్​ వేదికగా పలు ప్రశ్నలు సంధించారు.

KTR SLAMS THE TG GOVT
KTR ON MUSI RIVER VICTIMS (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 3, 2024, 1:14 PM IST

KTR Latest Tweet On Musi Rever : మూసీ సుందరీకరణ పేరుతో రేవంత్ రెడ్డి సర్కారు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. గుండెలు ఆగుతున్నా, కుటుంబాలు విడిపోతున్నా సర్కారు వెనక్కి తగ్గటం లేదంటూ విమర్శించారు. కష్టపడి పైసా పైసా కూడబెట్టి కట్టిన కలల సౌధం ఖరీదు అక్షరాలా రూ.25 వేలా? అంటూ ప్రశ్నించారు. బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి కట్టిన గూడును కూల్చుతారనే భయంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయన్నారు. ఇళ్లు పోతాయనే భయంతో బుచ్చమ్మ, కుమారన్న చనిపోయారని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

ఇదే మీ అన్న, మంత్రుల ఇళ్లకు రూ.50 వేల పరిహారం ఇస్తే కూల్చివేతలకు ఒప్పుకుంటారా? అని సూటిగా ప్రశ్నించారు. గంగా నదిని స్వచ్ఛంగా మార్చడానికి కిలో మీటరుకు రూ.17 కోట్లు ఖర్చు అయితే, మూసీ నదిని సుందరీకరించడానికి కిలో మీటరుకు రూ.2700 కోట్లు ఎందుకు? అని ప్రశ్నించారు. ఏమైనా బంగారం, వెండి లాంటివి వాడుతున్నారా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇది మూసీ బ్యూటిఫికేషన్​ కాదు, లూటిఫికేషన్​ అని విమర్శించారు.

మరో మహిళ తన భర్త మృతికి రేవంత్ రెడ్డే కారణమంటూ వ్యాఖ్యానించిన వీడియోను కేటీఆర్ పోస్ట్ చేశారు. ఇది మీ హైడ్రా, మీ ప్రభుత్వం చేసిన హత్య అంటూ ఘాటుగా స్పందించారు. ఆ ఉసురు మీ పార్టీకి తగలదా? ప్రాణాలు తీయటమే ఇందిరమ్మ పాలన అని మరోసారి రుజువు చేశావ్ అని విమర్శించారు. మిత్తితో సహా చెల్లించేలా ప్రజలే మీకు గుణపాఠం చెప్తారని తీవ్రంగా హెచ్చరించారు.

రూ.25 వేల ప్రోత్సాహకం : మూసీ నిర్వాసితులకు రెండు పడక గదులు ఇస్తున్న చోటుకు వెళ్లేందుకు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ.25 వేల ప్రోత్సాహకం అందించనుంది. ఇల్లు ఖాళీ చేస్తున్నప్పుడే రెవెన్యూ అధికారులు వారికి ఈ మొత్తం అందించనున్నారు. వారం రోజుల పాటు వారికి ఉపయుక్తంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు.

దగ్గర్లో ఇళ్లిస్తేనే సుముఖత. నిర్వాసితుల్లో చాలామంది చిన్నచిన్న పనులు చేసుకునేవారే. రెండు పడక గదుల ఇళ్లు ఇస్తామంటున్నా వీరిలో చాలామంది వెళ్లేందుకు ఇష్టపడటంలేదు. అక్కడ పనులు దొరక్కపోవడం, చిరు వ్యాపారులు పండ్లు, కూరగాయలు విక్రయించుకోవడానికి అనువైన పరిస్థితులు ఉండకపోవడం వంటి కారణాలను అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. తమకు సమీపంలోనే రెండు, మూడు కిలోమీటర్ల దూరంలో ఇళ్లు కేటాయించాలని కోరుతున్నారు. దీంతో హిమాయత్‌నగర్, అంబర్‌పేట, రాజేంద్రనగర్, గండిపేట మండలాల పరిధిలో ఉంటున్న వారికి పిల్లిగుడెసెలు, జియాగూడ, నార్సింగి ప్రాంతంలోని డబుల్‌ ఇళ్లను కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకూ 40శాతం మంది మాత్రమే ఖాళీచేయగా, మిగిలినవారు ఇష్టపడటం లేదు. రెవెన్యూ అధికారులు గురు, శుక్రవారాల్లో ప్రతి కుటుంబాన్ని కలిసి వారి ఇబ్బందులను తెలుసుకొనే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు.

మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపిన కేటీఆర్ - KTR Legal Notices to Konda Surekha

'వారందరి ట్వీట్స్​ చూశాక నేను చాలా బాధపడ్డా - కేటీఆర్​ విషయంలో మాత్రం తగ్గేదే లే' - Konda Surekha Latest news on ktr

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.