మంత్రి సురేఖ అంశానికి సినీ ప్రముఖులు ఇక్కడితో ముగింపు పలకాలి : మహేశ్ కుమార్ గౌడ్ - TPCC Cheif Request Cine Industry - TPCC CHEIF REQUEST CINE INDUSTRY
🎬 Watch Now: Feature Video
Published : Oct 3, 2024, 1:31 PM IST
|Updated : Oct 3, 2024, 1:41 PM IST
TPCC Cheif Mahesh Kumar Goud Request Cine Industry : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల గురించి సినీ నటుల నుంచి వస్తున్న స్పందన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఓ వీడియో విడుదల చేశారు. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో ఈ అంశానికి ఇక్కడితో ముగింపు పలకాలని ఆయన కోరారు. ఇరు వైపులా మహిళలు ఉన్నందున ఈ విషయాన్ని ఇంతటితో వదలేయాలని వీడియోలో పేర్కొన్నారు. మహిళల మనోభావాలను కించపరచాలని మంత్రి ఉద్దేశం కాదన్నారు. మహిళల మనోభావాలను కించపరచాలని తన ఉద్దేశ్యం కాదని ఆయన స్పష్టం చేశారు.
కొండా సురేఖ ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్‌లో హీరోయిన్ సమంత అంటే తనకు అభిమానం మాత్రమే కాదు ఆదర్శం అని కూడా పేర్కొన్నారన్నారు. ఒక సోదరుడు సోదరికి నూలు దండ వేస్తే కూడా మంత్రిపై అసభ్యకర పదజాలంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ చూశారని మండిపడ్డారు. సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడొద్దని కాంగ్రెస్ నాయకులకు, మంత్రులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు.