ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రకటన నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. స్పందించిన మెదక్ జిల్లా కలెక్టర్ ధర్మారెడ్డి... నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికుల సమ్మె దృష్ట్యా మెదక్ డిపోలో ఉన్న 36 ప్రైవేటు బస్సులు నడుస్తాయని తెలిపారు. మరో 68 ఆర్టీసీ బస్సులను ప్రైవేటు వ్యక్తులు వచ్చి నడుపుతారని పేర్కొన్నారు. అలాగే ఆర్టీసీ కార్మికులు సమ్మె ప్రశాంతంగా చేసుకోవాలని... బస్సులు నడిపేందుకు వచ్చిన ప్రైవేటు వ్యక్తులను అడ్డుకోవడం లాంటివి చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపో, బస్టాండుల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: ప్రధానికీ తప్పని 'ఉల్లి' కష్టాలు.. కూరలో వాడొద్దని ఆదేశం!