ETV Bharat / state

పచ్చదనం, పరిశుభ్రతకు అందరూ సహకరించాలి: కలెక్టర్ ఎస్.హరీష్ - పచ్చదనంపై మెదక్ కలెక్టర్ హరీశ్ వ్యాఖ్యలు

పచ్చదనం, పరిశుభ్రత కోసం అందరూ సహకరించాలని మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్ కోరారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా పచ్చదనానికి సీఎం కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని తెలిపారు. జిల్లాలో ఈ సారి 35 లక్షలకు పైగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు.

medak collector, haritha haram 2021
మెదక్ కలెక్టర్, హరితహారం 2021
author img

By

Published : Jun 19, 2021, 4:23 PM IST

మెదక్ జిల్లా పచ్చదనంతో పరిశుభ్రంగా ఉండడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ ఎస్.హరీశ్ విజ్ఞప్తి చేశారు. కలుషిత వాతావరణం నుంచి మానవజాతిని కాపాడటానికి మొక్కల పెంపకం ఎంతో అవసరమని అన్నారు. పచ్చదనానికి సీఎం కేసీఆర్ ఎంతో ప్రాముఖ్యతనిచ్చి తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. మెదక్ పట్టణం వెంకట్రావు నగర్ కాలనీలోని నర్సరీని, హౌసింగ్ బోర్డులో ప్రకృతి వనం, నర్సరీలను మున్సిపల్ కమిషనర్ శ్రీహరితో కలిసి శనివారం పరిశీలించారు.

ఆకుపచ్చ తెలంగాణ

భూభాగంలో 33 శాతం మేర అడవులు విస్తరించి ఉండాలని, నేడు నగరాలు విస్తరిస్తుండడం వల్ల అడవులు తగ్గిపోతున్నాయని తెలిపారు. పర్యావరణ సమతుల్యం దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఆకుపచ్చ తెలంగాణ కోసం హరిత హారం కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. ఈ సారి జిల్లాలో 35 లక్షలకు పైగా మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించి... 469 నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నామని పేర్కొన్నారు.

యంత్రాంగం సిద్ధం

ఈ విడతలో గ్రామ, మండల, జిల్లా ప్రధాన రహదారుల వెంట పలు వరసల్లో మొక్కలు నాటనున్నామని తెలిపారు. ప్రభుత్వ సంస్థల ప్రాంగణాల్లో, ఇతర ఖాళీ ప్రదేశాల్లో నాటేందుకు యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నామని అన్నారు. ఇళ్లలోనూ పండ్లు ,పూలు, ఔషధ మొక్కలు నాటాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మెదక్ పట్టణంలో మురికి గుంటలను గుర్తించి కాలువలు నిర్మించాలని, శిథిలావస్థలో ఉన్న కట్టడాలను తొలగించాలని మున్సిపల్ కమిషనర్​కు సూచించారు. నర్సరీలు, అర్బన్ పార్కులు ఇంకా మెరుగుపరచాల్సిన అవసరముందన్నారు. నర్సరీల మార్గదర్శకాలకనుగుణంగా నిర్వహించాలని, సాంకేతిక సమస్యలుంటే డీఎఫ్​వోను సంప్రదించాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీహరి, ఆయా వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: యువతకు ఆదర్శం ఈ జొమాటో గర్ల్: ఓ వైపు పని.. మరోవైపు చదువు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.