ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముస్లింలకు రంజాన్ పర్వదినం గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ముస్లింలు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ప్రతి రంజాన్‌కు దుస్తుల పంపిణీ చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
అనంతరం లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ ఛైర్పర్సన్ లావణ్య రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ రాగి అశోక్, మున్సిపల్ కౌన్సిలర్లు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: తెలంగాణలో నేడు, రేపు వడగండ్ల వర్షాలు