మెదక్ పట్టణంలో క్రిస్మస్ వేడుకలు కన్నుల పండువలా జరిగాయి. ఆసియాలోనే రెండో పెద్ద చర్చిగా పేరుగాంచిన మెదక్ చర్చికి వేలాదిగా తరలివచ్చిన క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చర్చి పరిసర ప్రాంతాలన్నీ జన సందోహంగా మారాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు చూపిన మార్గాన్ని ప్రతి ఒక్కరు ఆచరించాలని హరీశ్ రావు సూచించారు. తోటివారి పట్ల ప్రేమ, జాలి, అభిమానంతో ఉండాలని.. పది మందికి ఉపయోగపడేలా జీవించాలని ఆయన పిలుపునిచ్చారు. క్రిస్మస్ సందర్భంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన వారంతా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. చర్చిలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల అలంకరణ అందరినీ ఆకట్టుకుంది.
ఇదీ చూడండి: సర్వమతాల సౌభ్రాతృత్వమే తెరాస లక్ష్యం