ETV Bharat / state

'ప్రణబ్​ ముఖర్జీ సేవలు యావత్​దేశానికి గర్వకారణం'

author img

By

Published : Sep 1, 2020, 3:54 PM IST

రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి క్రియాశీల పాత్ర పోషించిన నాయకుడు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ మరణం భారతజాతికి తీరని లోటని భాజపా మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ పేర్కొన్నారు. భాజపా కార్యాలయంలో కార్యకర్తలు నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.

bjp medak district leaders deep condolences to the pranab mukherjee death
'ప్రణబ్​ ముఖర్జీ సేవలు యావత్​దేశానికి గర్వకారణం'

మెదక్​ జిల్లాలోని భాజపా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సామాన్యుడి నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన వ్యక్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ అని కొనియాడారు. ఆయన దేశానికి చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. దేశ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి క్రియాశీల పాత్ర పోషించిన ఒక నాయకుడిని కోల్పోవడం భారతజాతికి తీరని లోటని తెలిపారు.

వివాద పరిష్కర్తగా వారికీ మంచి పేరుందని తెలిపారు. భారత దేశానికి రక్షణ మంత్రిగా, విదేశీ వ్యవహారాల మంత్రిగా, ఆర్థిక మంత్రిగా పలు కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు నల్లాల. విజయ్‌ కుమార్, బనప్పగారి సుదాకర్ రెడ్డి, జిల్లా ఉపాద్యక్షులు దత్తు ప్రకాష్, జిల్లా కార్యదర్శి వెల్ముల మహేశ్వరి, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు సందీప్, కిసాన్ మోర్చ జిల్లా అధ్యక్షులు మల్లరెడ్డి, దళిత మోర్చ జిల్లా అధ్యక్షులు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: స్వచ్ఛమైన గాలి.. మట్టివాసన... ఫామ్‌టూర్స్‌కు నగరవాసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.