ETV Bharat / state

చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా?.. అయితే జాగ్రత్త! - medak district latest news

చెత్తే కదా అని ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా అయితే జాగ్రత్త! ఎందుకంటే రోజులు మారాయి. గతంలో మాదిరి కాకుండా చెత్త రోడ్లపై పడేస్తున్న వారిపై అధికారులు నిఘా పెట్టారు. వారిపై వివిధ రూపాల్లో కఠిన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో రోడ్డుపై చెత్త వేసిన యాజమాని ఇంట్లో అదే చెత్తను తీసుకెళ్లి వేశారు.

Be careful if the garbage is falling where it belongs medak
చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా అయితే జాగ్రత్త!
author img

By

Published : Jul 10, 2020, 4:36 PM IST

మెదక్ పట్టణంలోని 29వ వార్డులో ఓ ఇంటి యజమానురాలు రోడ్డుపై చెత్త వేసినందుకు పురపాలిక అధికారులు బుద్ధి చెప్పారు. చెత్తను ట్రాక్టర్​ వచ్చినపుడు అందులో ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. బయట వేయకూడదని చెప్పారు. స్వచ్ఛత విషయంలో మీకు బాధ్యత లేదా అని యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురిపై జరిమానాలు విధించినా రోడ్లపై చెత్త వేయడంలో మార్పు రావడం లేదన్నారు.

అక్కడ వేసిన చెత్తను తమ సిబ్బందిచే బుట్టలో తీసుకొచ్చి యజమాని ఇంట్లో వేశారు. రోడ్డుపై చెత్త వేసినందుకు ఆ అధికారి సుమారు రెండు గంటల పాటు ఆమె ఇంటికి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అధికారిని వివరణ కోరగా చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకూడదని చెప్పడానికే ఇలా చేశామని చెప్పారు. చెత్తను ఇష్టానుసారంగా రోడ్లపై పడేస్తే వారి ఇంటికి విద్యుత్​, నీటి సరఫరా నిలిపి వేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయని ఆమె తెలిపారు.

చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారా అయితే జాగ్రత్త!

ఇదీ చూడండి : 'సచివాలయం కూల్చివేత నిర్ణయం సరైంది కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.