ETV Bharat / state

గజ్వేల్​లో వైభవంగా బతుకమ్మ వేడుకలు - బతుకమ్మ సంబరాలు

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గ వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా జరిగాయి. మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ప్రధాన కూడళ్ల వద్ద ఉంచి చుట్టూ తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడుతూ.. ఆటలు ఆడారు.

Bathukamma Celebrations in Siddipet District Gajwel
గజ్వేల్​లో అంగరంగ వైభవంగా బతుకమ్మ వేడుకలు
author img

By

Published : Oct 24, 2020, 9:10 PM IST

సిద్ధిపేట జిల్లా గజ్వేల్​లో తెలంగాణ సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. బతుకమ్మను తీరొక్క పూలతో అందంగా తయారుచేసి పట్టణాలు, పల్లెల్లో డప్పు చప్పుళ్ళ మధ్య తీసుకువచ్చి బతుకమ్మలను ప్రధాన కూడళ్ల వద్ద పాటలు పాడుతూ ఆటలు ఆడారు.

అనంతరం ఊరేగింపుగా తీసుకెళ్తూ.. స్థానిక చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. చెరువుల వద్ద వాయినాలు ఇచ్చి పుచ్చుకున్నారు. చెరువుల వద్ద సద్దులు అందరికీ పంచారు. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఇదీ చూడండి: భాగ్యనగరంలో కిలో ఉల్లి 35 రూపాయలే...: మంత్రి నిరంజన్​రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.