విద్యార్థులు మత్తు పదార్థాలు, అంతర్జాలానికి దూరంగా ఉండేలా చూడటానికి వారి తల్లిదండ్రులకు హితబోధ చేయాలని ఆయన సూచించారు. గురువారం హవేలి ఘనపూర్ గ్రామ శివారులోని డైట్ కళాశాలలో, జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. పిల్ల్లలపై లైంగిక వేధింపులు, మత్తు పదార్థాలు, సురక్షిత అంతర్జాల వినియోగం, వారిపై హింస తదితర అంశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పిల్లల నడవడికను గమనిస్తూ చరవాణి వినియోగించకుండా జాగ్రత్తలు తీసుకునేలా చూడాలని, తద్వారా కలిగే అనర్థాలను విద్యార్థులకు వివరించాలన్నారు.
మత్తు పదార్థాలకు అలవాటు పడితే భవిష్యత్తు అంధకారమవుతుందని, శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. గుండె, కాలేయం, మెదడుపై ప్రభావం పడి నరాలు పనిచేయవని చెప్పారు. మత్తు పదార్థాలకు అలవాటు పడినవారు నేరాలు, ఆత్మహత్య చేసుకునే అవకాశాలున్నాయన్నారు.
సదస్సులో కళాశాల ప్రిన్సిపల్ సయ్యద్ అరిపుద్దీన్, అధ్యాపకులు గంగయ్య, ఉత్తమ్‌కుమార్, సతీష్, అప్పినాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:స్నేహ సంబంధాలు పటిష్ఠమే లక్ష్యం