మెదక్ జిల్లాలో 32వ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని జిల్లా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రిచర్డ్ పేర్కొన్నారు.
ఆటో ర్యాలీ ..
32వ రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా.. జిల్లా రవాణా శాఖ కార్యాలయం నుంచి మెదక్ బస్టాండ్ వరకు రోడ్డు భద్రత నియమాలపై అవగాహన కల్పిస్తూ ఆటో ర్యాలీ నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలని కోరిన జిల్లా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్.. ఆటో డ్రైవర్లు వారి వాహనాలకి సంబంధించిన డాక్యుమెంటేషన్ తప్పకుండా వెంట ఉండేలా చూసుకోవాలని సూచించారు.