రోడ్డు ప్రమాదాల వల్ల చాలా మంది తమ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. ఎంతో మంది చిన్నారులు అనాథలవుతున్నారు. ప్రమాదాలపై ఎంత అవగాహన కల్పించినా... పట్టించుకోకపోవడం వల్ల ఎన్నో కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది. దీనిపై తన వంతు బాధ్యతగా.. మెదక్‌కు చెందిన ఆటో డ్రైవర్ షఫీ వినూత్న రీతిలో అవగాహన చేపడుతున్నాడు. ప్రమాదాలు నివారించేందుకుగాను తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు.
షఫీ చేపట్టిన ఈ యాత్రను మెదక్ పట్టణ సీఐ వెంకటయ్య ప్రారంభించారు. వారం రోజులపాటు మెదక్ పట్టణంలో, మరో 20 రోజులు మండలవ్యాప్తంగా కొనసాగనుందని తెలిపాడు. తన ప్రయత్నం వల్ల కొంతమంది రోడ్డు భద్రత నియమాలు పాటించినా... కొన్ని ప్రాణాలు కాపాడినవాడిని అవుతానని షఫీ చెబుతున్నాడు. మహిళా భద్రతలో భాగంగా... అవగాహన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సీఐ వివరించారు.
ఇదీ చూడండి: మున్సిపోల్లో పోటీ లేదు.. అన్ని తెరాసకే: కేసీఆర్