మెదక్ జిల్లా పోతంశెట్టిపల్లి చౌరస్తా నూతన బ్రిడ్జి వద్ద ఆటోను కారు ఢీకొన్న ఘటనలో ప్రయాణికులతో సహా ఆటో మహబూబ్ కాలువలో పడిపోయింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు తీవ్రంగా గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రమాదం ఎలా జరిగిందంటే..?
పోతంశెట్టిపల్లి నుంచి మెదక్ వైపు వెళ్తున్న ఆటోను, మాచవరం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఎదురుగా వచ్చి పోతంశెట్టిపల్లి నూతన బ్రిడ్జి వద్ద ఢీకొంది. సమాచారం అందుకున్న ఎస్సై శ్రీనివాస్‌గౌడ్, సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.
క్షతగాత్రులను 108 వాహనంలో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన అనంతరం కారులోని వారు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ఇదీ చూడండి: వ్యాక్సిన్ వచ్చేది అప్పుడే: శాంతా బయోటెక్ ఛైర్మన్