ETV Bharat / state

శ్వాసకు ఆటంకం.. నియంత్రణే కీలకం - corona effect on Asthma patients

ఉచ్ఛ్వాస, నిశ్వాస సజావుగా సాగితేనే మనిషి మనుగడ సాధ్యం. శ్వాసకు అడ్డంకులు ఏర్పడుతుంటే ఆ నరకం అనుభవించిన వారికే తెలుస్తుంది. ఆస్తమా రోగులకు ఊపిరి తీసుకోవడం ఒక్కోసారి ప్రాణం పోయినంత పని అవుతుంది. నేడు ప్రపంచ ఆస్తమా దినం సందర్భంగా మెదక్​ జిల్లాలో పరిస్థితిపై కథనం..

corona effect on Asthma patients
corona effect on Asthma patients
author img

By

Published : May 5, 2020, 1:10 PM IST

మనుషుల జీవనశైలి, వాతావరణ కాలుష్యం ప్రధానంగా ‘ఆస్తమా’ను పెంచి పోషిస్తున్నాయి. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు కూడా ఆస్తమాతో సతమతం అవుతున్నవారున్నారు. ఒకసారి ఆస్తమా వచ్చిందంటే పూర్తిగా వదిలి పోవడం చాలా కష్టం. సరైన జాగ్రత్తలతో వ్యాధిని నియంత్రించొచ్చు.

ప్రస్తుతం కరోనా వైరస్‌ అతలాకుతలం చేస్తోంది. ఆస్తమా రోగులు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉంది. వాయు నాళాల కండరాలు వాచిపోవడం వల్ల నాళాలు సన్నబడుతాయి. శ్వాసకు ఆటంకంగా మారుతుంది. గాలి సక్రమంగా పీల్చడం, వదలడం ఇబ్బంది అవుతుంది. గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతీలో బిగుసుకు పోయినట్టు అనిపిస్తుంది. ప్రస్తుతం ఆస్తమాతో బాధపడే వారు అప్రమత్తంగా ఉండకపోతే కరోనా సోకే అవకాశం ఉంటుంది.

104 వాహన సేవ...

మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 3,370 మంది ఆస్తమా రోగులు ఉన్నారు. వీరంతా 50 ఏళ్ల పైబడిన వారే. వీరందరికి ప్రస్తుతం 104 వాహనం గ్రామాల్లోకి వెళ్లినప్పుడు నెలకు సరిపడా మందులను అందజేస్తున్నారు. ఒక్కో రోగికి 30 లేదా 60 గోలీలు, ఒక సిరప్‌ను పంపిణీ చేస్తున్నారు.

జిల్లా కేంద్రం మెదక్‌లోని ప్రాంతీయ ఆసుపత్రిలో మాత్రమే ఆస్తమాకు సంబంధించి రోగులకు వైద్యులు సేవలందిస్తున్నారు. ఇది వరకు ఇద్దరు వైద్యులు ఉండగా, ఒకరు సెలవుపై వెళ్లారు. ప్రస్తుతం ఒక్కరు మాత్రమే రోగులను పరీక్షిస్తున్నారు. వైద్యులు రాసిన మందులను క్రమం తప్పకుండా వాడాలి.

ఇన్‌హేలర్‌, నెబ్‌లైజర్‌ సరైన పద్ధతిలో వాడాలి... అలాగే శుభ్రం చేసుకోవాలి. ఆస్తమా ఉన్న వారు పొగ, ఘాటైన వాసనలకు దూరంగా ఉండాలి. పులుపు, తీపి తినే వస్తువులను తీసుకోవద్దు. దగ్గు, జ్వరం, జలుబు లక్షణాలు ఉండే వారితో దూరంగా ఉండాలి. ఇల్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

ప్రస్తుతం మరింత జాగ్రత్త అవసరం...

కోవిడ్‌-19, ఆస్తమా రెండూ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు. ఆస్తమా ఉన్న వ్యక్తుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఆస్తమా లక్షణాలుంటే జ్వరం, దగ్గుతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. ఆస్తమా ఉన్న వ్యక్తుల్లో కోవిడ్‌ సోకితే ప్రమాదం ఎక్కువ. కిడ్నీ, క్యాన్సర్‌, గుండె సంబంధిత వ్యాధి ఉన్న వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యుడిని నిరంతరం సంప్రదించి సూచనలను పాటించాలి.

- ప్రశాంత్‌కుమార్‌, ఎండీ, పల్మనాలజీ, మెదక్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.