ETV Bharat / state

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా 'కవి సమ్మేళనం'

author img

By

Published : Apr 4, 2021, 7:02 AM IST

ఆజాదీ కా అమృత్​ మహోత్సవాల్లో భాగంగా.. రాష్ట్రవ్యాప్తంగా 'కవి సమ్మేళనం' ఘనంగా నిర్వహించారు. వివిధ జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో కవులను ఘనంగా సన్మానించారు. అమరవీరుల త్యాగఫలాలను అంశాలుగా చేసుకుని కవులు.. కవితాగానం చేసి ప్రేక్షకులను రంజింపచేశారు.

Azadi Ka Amrit Mahotsav
కవి సమ్మేళనం

ఆజాదీ​ కా అమృత్​ మహోత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 'కవి సమ్మేళనం' వేడుకలు వైభవంగా జరిగాయి. వివిధ జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో.. కవులను ఘనంగా సత్కరించారు. స్వాతంత్రోద్యమంలో కవుల పాత్రను స్మరించుకున్నారు.

నిజామాబాద్​లో..

స్వాతంత్రోద్యమం, తెలంగాణ ఉద్యమంలో కవుల పాత్ర ఎనలేనిదని మంత్రి ప్రశాంత్​ రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని అంబేడ్కర్ భవన్​లో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.

మెదక్​లో..

స్వతంత్ర పోరాటంలో కవులు, పాత్రికేయుల పాత్ర మరువలేనిదని ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. తమ సర్వస్వం త్యాగం చేసిన మాహానుభావుల సేవలను స్మరిస్తూ.. ముందుకు సాగాలన్నారు. యువజన క్రీడలశాఖ ఆధ్వర్యంలో.. కలెక్టరేట్​లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు.

వరంగల్‌ కలెక్టర్​ రాజీవ్‌గాంధీ హనుమంతు.. జిల్లాలోని ప్రముఖ కవులను ఘనంగా సన్మానించారు. ఆదిలాబాద్‌లో జరిగిన వేడుకల్లో.. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కవులు... తమ కవిత్వాలతో అందరిలో ఉత్తేజం నింపారు. సంగారెడ్డిలో 36 మంది భాష పండితులు కార్యక్రమానికి హాజరై.. తెలుగు, ఉర్దూ, హిందీలో కవితలు వినిపించారు. గద్వాలలో భాషా సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో.. కవిసమ్మేళనాన్ని ఘనంగా జరిపారు.

ఇదీ చదవండి: నా భర్తతో ఆ విషయం చెబుతానని బెదిరిస్తున్నాడు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.