రాష్ట్రంలో ఇంఛార్జ్ కలెక్టర్లు ఉన్న మెదక్, పెద్దపల్లి జిల్లాలకు పూర్తి స్థాయి కలెక్టర్లను ప్రభుత్వం నియమించింది. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న ఎస్. హరీశ్... మెదక్ కలెక్టర్గా నియమితులయ్యారు.
సీసీఎల్ఏ కార్యాలయంలో ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఉన్న ఎస్. సంగీత పెద్దపల్లి కలెక్టర్గా నియామకమయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.