లాక్డౌన్ సడలింపులతో రాష్ట్రంలోని దేవాలయాలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో మెదక్ సీఎస్ఐ చర్చిలో భక్తులకు ప్రవేశం కల్పించారు. థర్మల్ స్క్రీనింగ్, శానిటైజేషన్ చేసిన తర్వాతే ప్రార్థనా మందిరంలోకి అనుమతిస్తున్నారు. భక్తులంతా విధిగా భౌతిక దూరం పాటించాలని మత గురువు విజయ్ కుమార్ సూచించారు. కరోనా నేపథ్యంలో చర్చి వద్ద భక్తుల సందడి అంతగా కనిపించటం లేదు.
మెదక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు - మెదక్ చర్చి తాజా వార్తలు
కరోనా కారణంగా గత కొన్నిరోజులుగా మూతపడ్డ ఆలయాలన్నీ నేడు పునఃప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మెదక్‌లోని సీఎస్ఐ చర్చిలో భక్తులకు ప్రవేశం కల్పించారు.
మెదక్ చర్చిలో భక్తులకు ప్రవేశం