మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం పెద్ద చింతకుంట వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మెదక్ వైపు వెళ్తున్న ఓ టాటాఏస్ వాహనం అతివేగంతో పెద్ద చింతకుంట వద్ద నిలిచి ఉన్న లారీని ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఆరుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే మదన్‌రెడ్డి తన వాహనం దిగి క్షతగాత్రుల వివరాలు తెలుసుకున్నారు. వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.
ఇదీ చదవండి:నేడు మంత్రివర్గ సమావేశం... అసాధారణ భద్రతా ఏర్పాట్లు!