సంగారెడ్డి జిల్లా రాళ్లకత్వ గ్రామానికి చెందిన జింక రవళి, గణేష్ దంపతులు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా నర్సాపూర్ సమీపంలో 10 తులాల బంగారు నగలు గల సంచి కిందపడి పోయింది. అటుగా వెళ్తున్న పోలీస్ కానిస్టేబుల్ రోడ్డుపై పడిన సంచిని తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లారు. సంచిలోని ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ ఆధారంగా వివరాలు తెలుసుకుని బాధితులకు సమాచారం అందించారు. ఎస్సై సందీప్‌రెడ్డి సమక్షంలో గణేశ్ దంపతులకు వారు పోగొట్టుకున్న సంచిని తిరిగి అప్పగించారు.
ఇదీ చూడండి : రామేశ్వరుడి సన్నిధిలో చంద్రశేఖరుడు