ETV Bharat / state

ఆగని ఆకృత్యం... ఆరేళ్ల బాలికపై అత్యాచారం! - మెదక్​ జిల్లా తాజా వాార్తలు

మెదక్​ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ కిరాతకుడు. పాప ఇంటి పక్కనే ఉండే సుధాకర్​ అనే వ్యక్తి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.

6years old girl allegedly raped in medak district
ఆరేళ్ల బాలికపై అత్యాచారం
author img

By

Published : Jan 9, 2021, 9:56 PM IST

మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం శబాష్‌పల్లి గ్రామంలో ఆరేళ్ల బాలికపై శుక్రవారం రాత్రి అత్యాచారం జరిగింది. అదే గ్రామానికి చెందిన సుధాకర్‌(24) అనే వ్యక్తి కొన్ని సంత్సరాలు విద్యావాలంటీర్‌గా పనిచేశాడు. అతని ఇంటిపక్కనే బాలిక అడుకుంటుండగా... ఆమె తల్లి బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి వెళ్లి అత్యాచారానికి పాల్పడినట్లు చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

వచ్చేసరికి సుధాకర్​ తమ ఇంట్లో నుంచి బయటకు వస్తున్నాడని బాలిక తల్లి తెలిపింది. చిన్నారిని వివరాలు అడగగా... అత్యాచారం జరిగినట్లు ఏడుస్తూ చెప్పిందని పేర్కొంది. శివ్వంపేట పోలిస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు వెల్లడించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో బర్డ్​ఫ్లూ ఆనవాళ్లు లేవు: మంత్రి తలసాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.