మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ మహాలక్ష్మి పిల్లల ఆసుపత్రిలో జన్మించిన నవజాత శిశువుకి వైద్యులు అరుదైన చికిత్స అందించి ప్రాణం పోశారు. నెలలు నిండకుండానే జన్మించిన శిశువుకు ఊపిరితిత్తులు ఇతర అవయవాలు ఇంకా పూర్తిస్థాయిలో ఎదగకపోవడం వల్ల మహానగరాల్లో అందించే చికిత్సను వైద్యుడు కుమార్ వర్మ తన ఆసుపత్రిలోనే 70 రోజులపాటు అందించి చిన్నారికి పునర్జీవం పోశారు.
ఆరునెలల్లోనే జన్మించిన చిన్నారి 500 గ్రాముల బరువుతో ఉండడం వల్ల చనిపోతుందేమోనని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్న సమయంలో డాక్టర్ కుమార్వర్శ తన చిన్నారికి ప్రాణం పోశారని శిశువు తండ్రి తెలిపారు. కరోనా విజృంభిస్తోన్న సమయంలో తన బిడ్డను, భార్యను ప్రాణాలతో కాపాడిన డాక్టర్ వర్మకు మనోహర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాడు.
ఇవీ చూడండి: హోంమంత్రికి కరోనా.. వైద్యాధికారులు ఏమంటున్నారంటే?