ETV Bharat / state

మంచిర్యాల తెరాస జిల్లా కార్యాలయానికి భూమి పూజ - బాల్క సుమన్

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో తెరాస పార్టీ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజలు చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్  గ్రామంలో భవన నిర్మాణానికి చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్ భూమిపూజ చేశారు.

మంచిర్యాల తెరాస భవన నిర్మాణానికి భూమి పూజ
author img

By

Published : Jun 24, 2019, 7:36 PM IST

మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామంలో తెరాస పార్టీ కార్యాలయ నిర్మాణానికి చెన్నూరు శాసనసభ్యుడు బాల్క సుమన్ భూమిపూజ చేశారు. కార్యక్రమంలో బెల్లంపల్లి, మంచిర్యాల శాసనసభ్యులతో పాటు మంచిర్యాల జిల్లా జెడ్పీ ఛైర్మన్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. రాష్ట్రం సిద్ధించాకే ప్రజలకు అన్నీ రకాల మౌలిక సదుపాయాలు అందుతున్నాయని వెల్లడించారు. తుమ్మిడిహట్టి వద్ద లేదా వార్ధా నది పైన ప్రాజెక్టు నిర్మాణం చేసి మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రైతులకు సాగు నీరందిస్తామని తెలిపారు.

మంచిర్యాల తెరాస భవన నిర్మాణానికి భూమి పూజ

ఇవీచూడండి: 'రేషన్ కార్డుంటే చాలు.. 2 కిలోల చేపలు ఉచితం'

File :TG_ADB_11_24_TRS OFFICE BHUMI PUJA_AV_C6 Reporter :santhosh maidam, mancherial... యాంకర్ విజువల్ బైట్ : మంచిర్యాల జిల్లా నస్పూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యాలయ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నూర్, బెల్లంపల్లి, మంచిర్యాల శాసనసభ్యులతో పాటు మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్మన్ భాగ్యలక్ష్మి పాల్గొని భూమి పూజ నిర్వహించారు... అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్దంచాకే ప్రజలకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుతున్నాయన్నారు.. కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రపంచంలోనే సువర్ణ అక్షరాలతో లికించదగిందన్నారు... త్వరలోనే కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి తెలంగాణలోని 45 లక్షల ఎకరాల భూములు సస్యశ్యామలం కానున్నాయన్నారు.. మిషన్ భగీరథ కు సంబంధించిన 60 శాతం నీటిని కాలేశ్వరం ప్రాజెక్టు నుంచి ప్రజలకు అందించనున్నరని ఆయన అన్నారు.. కచ్చితంగా తుమ్మిడి హెట్టి వద్ద లేదా వార్ధా నది పైన ప్రాజెక్టు నిర్మాణం చేసి మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రైతాంగానికి నీరందిస్తామని వారు తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పార్టీ అని,పార్టీ కోసం అహర్నిశలు పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్త కి పార్టీలో గుర్తింపు సముచిత స్థానాన్ని ఇస్తామన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఏనాడు పదవి ఆశించలేదని కానీ తెలంగాణ ప్రజల కలలు నెరవేర్చటానికి తాము అధిష్టానం పిలుపు మేరకు పార్టీలో చేరి పదవులు అలంకరించాలని, తెచ్చుకున్న తెలంగాణను బంగారు తెలంగాణ మలచడమే తమ ముందున్న కర్తవ్యం అని ఆయన అన్నారు. బైట్: బాల్క సుమన్ , చెన్నూరు శాసనసభ్యుడు..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.