మంచిర్యాల జిల్లాలో తెరాస సభ్యత్వ నమోదు ప్రక్రియ చురుకుగా కొనసాగుతోంది. బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, పార్టీ ఇంఛార్జి అరిగెల నాగేశ్వరరావు ప్రారంభించారు. సభ్యత్వ నమోదుకు గులాబీ కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తెరాస ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ కోసం కంకణం కట్టుకుని పనిచేస్తున్నారని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.
ఇదీ చదవండిః ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశం