మంచిర్యాల జిల్లా మందమర్రిలో నిరుపేద కుటుంబానికి చెందిన ఓదేలు-పద్మ దంపతుల కూతురు వివాహానికి తెరాస విద్యార్థి యువజన విభాగం నాయకులు చేయూతనందించారు. రూ.30 వేల విలువ చేసే పెళ్లి సామగ్రిని యువతి కుటుంబ సభ్యులకు అందజేసి తమ ఔదార్యం చాటుకున్నారు.
అంతకముందు బాల్క సుమన్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలువురు తెరాస నాయకులు రక్తదాన శిబిరం నిర్వహించి.. మొక్కలు నాటారు.