మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో తెరాస నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, అరిగెల నాగేశ్వరరావు ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 30 రోజుల ప్రత్యేక ప్రణాళికను కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలని దుర్గం చిన్నయ్య కోరారు. కేటీఆర్ ఆదేశాల మేరకు అన్ని మండలాలు, గ్రామాల్లో పార్టీ కమిటీలు ఏర్పాటుచేయాలని సూచించారు. సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి చేరవేయాలని కోరారు.
ఇవీ చూడండి: రక్షణ శాఖ ఎస్టేట్స్ డీజీకి కేసీఆర్ లేఖ... ఎందుకంటే...?