మంచిర్యాలలోని ఐబీ చౌరస్తాలో ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన ట్రాఫిక్ సిగ్నల్‌ను ఎమ్మెల్యే దివాకర్ రావు, రామగుండం సీపీ సత్యనారాయణలతో కలిసి జిల్లా కలెక్టర్ భారతి హోళీకేరి ప్రారంభించారు. కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను మరింత తగ్గించే దిశగా వాహనాల రద్దీ ప్రాంతంలో ట్రాఫిక్ సిగ్నళ్లు ఏర్పాటు చేస్తున్నామని సీపీ తెలిపారు.
మంచిర్యాలలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటం వల్ల డీఎంఎఫ్టీ నిధుల నుంచి ఆరు లక్షల వ్యయంతో ట్రాఫిక్ సిగ్నల్‌ను ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే దివాకర్ రావు తెలిపారు.
ఇదీ చదవండి: నీటిపారుదల శాఖ జలవనరుల శాఖగా మార్పు: సీఎం కేసీఆర్