మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఈదురుగాలులకు జన్నారం మండలంలోని రేండ్లగూడలో రాజన్న అనే రైతు విద్యుత్ తీగలు తెగి పడడం వల్ల కరెంట్ షాక్ తో మృతి చెందాడు. లక్షెట్టిపేట మండలంలోని శాంతాపూర్, పోతపల్లి, గుల్లకోట గ్రామాల్లో ఈదురుగాలులకు తీవ్ర నష్టం వచ్చింది.
జాతీయ రహదారి వెంట విరిగిన చెట్ల కొమ్మలు
గుల్లకోట నుంచి శాంతాపూర్ గ్రామం వరకు జాతీయ రహదారి వెంట చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. శాంతాపూర్‌లో మల్లేశ్, గంగిరెడ్డిల ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. గుల్లకోటలో మరో నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మొత్తం 7 ఇళ్లు దెబ్బతిన్నట్లు తహసీల్దార్ వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో వర్షం నీరు చేరడం వల్ల ధాన్యం తడిసి ముద్దయింది.
ఇదీ చూడండి: ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి: ఈటల