ETV Bharat / state

రికార్డు సృష్టించిన జైపూర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం - మంచిర్యాల జిల్లా తాజా వార్తలు

జైపూర్‌ సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం మరోసారి రికార్డు సృష్టించింది. ఫిబ్రవరి నెలలో స్టేషన్​లోని రెండు యూనిట్లు 100 శాతంపైగా పీఎల్​ఎఫ్​ సాధించాయని అధికారులు పేర్కొన్నారు.

The record-setting Jaipur Thermal Power Station at mancherial
రికార్డు సృష్టించిన జైపూర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం
author img

By

Published : Mar 2, 2020, 7:14 PM IST

మంచిర్యాల జిల్లా జైపూర్‌ సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం మరోసారి రికార్డులు నెలకొల్పింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో స్టేషన్‌లోని రెండు యూనిట్లు 100 శాతంపైబడి పీఎల్‌ఎఫ్‌ (ప్లాంటు లోడ్‌ ఫ్యాక్టర్‌) సాధించాయని సింగరేణి అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పీఎల్‌ఎఫ్‌ 100.18 శాతంగా నమోదైంది.

ఫిబ్రవరి నెలలో ఈ ప్లాంటు 836.70 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసింది. అందులో ప్లాంటుకు అవసరమైన విద్యుత్తు పోనూ మిగిలిన 791.79 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును గ్రిడ్‌కు సరఫరా చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 8,398 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయగా... 7,895 మిలియన్‌ యూనిట్లను రాష్ట్ర అవసరాలకు అందించింది. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని రెండు యూనిట్లు నూరుశాతం పీఎల్‌ఎఫ్‌ సాధించడంపై సంస్థ సీఎండీ ఎన్‌.శ్రీధర్‌ సంతోషం వ్యక్తం చేశారు. పలువురు అధికారులకు అభినందనలు తెలిపారు.

ఇదీ చూడండి : షాకింగ్.. అందరూ చూస్తుండగానే ప్లై ఓవర్ మీది నుంచి దూకి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.