ETV Bharat / state

'కేసీఆర్ రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టారు' - polam baata poru baata latest updates

రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చేపట్టిన పొలం బాట పోరుబాటకు మంచిర్యాల జిల్లా తపాలాపూర్​లో ఘన స్వాగతం పలికారు. కార్మిక, కర్షక సంక్షేమం కోసమే రైతు ఉద్యమం చేపడుతున్నట్లు తెలిపిన భట్టి.. రైతులతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా.. వ్యవసాయ, సంక్షేమ రంగాలపై నిర్మాణాత్మక పోరుచేస్తామని వివరించారు.

The farm walkout undertaken by the CLP against the farmer laws was given a solid welcome in Tapalapur, Manchiriala district
'కేసీఆర్ రాష్ట్ర భవిష్యత్తుని తాకట్టు పెట్టారు'
author img

By

Published : Feb 12, 2021, 2:46 AM IST

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మోకరిల్లి రైతు ప్రయోజనాలను తాకట్టు పెట్టారని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంచిర్యాల జిల్లాలో పొలం బాట-పోరుబాట కార్యక్రమంలో పాల్గొన్న ఆయనకు.. రైతులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా ఏఐసీసీ సభ్యుడు ప్రేమ్ సాగర్ రావు అధ్యక్షతన రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో అన్నదాతలు, స్వయం సహాయక సంఘం సభ్యుల సమస్యలను నేతలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలను తొలుత వ్యతిరేకించిన సీఎం కేసీఆర్, దిల్లీ వెళ్లి వచ్చిన తరువాత సమర్థిస్తున్నట్లు ప్రకటించడం ఒప్పందంలో భాగమేనని భట్టివిక్రమార్క దుయ్యబట్టారు.

రైతు చట్టాల రద్దు అంశాన్ని శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తుతామని స్పష్టం చేశారు. పొలం బాట- పోరుబాట ఈ నెల 24 వరకు రాష్ట్రంలో పర్యటిస్తున్నదని భట్టి తెలిపారు. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని రెండు కోట్ల మంది రైతుల సంతకాలతో.. తమ నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రపతిని కలిశారని తెలిపారు.

ఓట్లను చీల్చే ప్రయత్నాలు..

ప్రగతి భవన్ వేదికగా రాష్ట్రంలో మరొక పార్టీలను పుట్టిస్తున్నారని, ఓట్లను చీల్చి ప్రయత్నాలు చేస్తున్నారని మంథని శాసనసభ్యులు శ్రీధర్ బాబు అన్నారు. రాష్ట్రంలో చివరి సారిగా 2011లో గ్రూప్-1 నియామకాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు అన్వేష్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఏఐసీసీ సభ్యులు ప్రేమ్ సాగర్ రావు, తదితరులు పాల్గొన్నారు.

'రాష్ట్రంలో నిర్బంధ వ్యవసాయం కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర భవిష్యత్తుని సీఎం కేసీఆర్ తాకట్టు పెట్టారు. 60, 70 ఏళ్ల నుంచి సాగుచేస్తున్న భూముల వివరాలు ధరణి నుంచి తొలగించారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.'

--మల్లు భట్టి విక్రమార్క, శాసనసభాపక్షనేత

ఇదీ చదవండి:జాతరొచ్చినాదో... నాగోబా జాతరొచ్చినాదో...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.