ETV Bharat / state

తెలంగాణ అన్నాహజారేను చూశారా...?

పదవీ విరమణ తర్వాత మంచి ఇల్లు కట్టుకుని... తీర్థయాత్రలకు తిరుగుతూ... నచ్చిన వ్యాపకాలతో గడిపేయడం సాధారణ వ్యక్తులు చేసే పని. కానీ సమాజ సేవే ఊపిరిగా.. పకృతి రక్షణే ఆశయంగా బతుకుతూ తెలంగాణా అన్న హజారేగా గుర్తింపు తెచ్చుకున్నారు బెల్లంపల్లికి చెందిన నాదిర్​ షా నక్వి.

telangana anna hazare nadhir sha nakvi
తెలంగాణ అన్నాహజారేను చూశారా...?
author img

By

Published : Dec 10, 2019, 7:51 PM IST

Updated : Dec 10, 2019, 11:36 PM IST

తెలంగాణ అన్నాహజారేను చూశారా...?

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రైల్వే రడగంబాల బస్తీకి చెందిన నాదిర్​షా నక్వి సింగరేణిలో కొంతకాలం క్లర్క్​గా పని చేశారు. ఆది నుంచి సమాజ సేవకు అధిక ప్రాధాన్యత నిచ్చే నక్వి...ఓ వైపు ఉద్యోగం చేస్తూనే సమాజంలో మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పించేవారు. పదవీ విరమణ అనంతరం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నారు. హజారే పాటలను అద్భుతంగా పాడగలరు. అమ్మాయి బొమ్మతో పాటలు పాడుతూ ఆకట్టుకుంటున్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం పరితపించే నక్వి ఇంటి ఆవరణలో రకరకాల మొక్కలను పెంచుతున్నారు. పక్షుల సంరక్షణ కూడా నక్వికి ప్రాణం. తొలి, మలి విడత తెలంగాణ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. రాలేగావ్ సిద్ధిలో అన్నా హజారే చేసిన దీక్షలో ఆయనతోపాటు పాల్గొన్నారు. శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్రమంతా తిరిగారు. డబ్బులు తీసుకుని ఓటేయద్దంటూ ప్రజలకు అవగాహన కల్పించారు.

ఇదీ చూడండి: 'కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయండి'

Intro:రిపోర్టర్ : ముత్తె వెంకటేష్
సెల్ నంబరు: 9949620369
tg_adb_81_06_special_story_on_telangana_hanna_hajare_pkg_ts10030
విభిన్న కళలతో తెలంగాణ అన్నా హజారే
....సమజసేవతో ప్రత్యేక గుర్తింపు
ఆయన సింగరేణి పదవి విరమణ పొందిన ఉద్యోగి .సమాజ సేవ చేయడం అంటే ఎంతో ఇష్టం. ప్రకృతి ప్రేమికుడు కూడా. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అన్న హజారేగా గుర్తింపు తెచ్చుకున్నాడు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కి చెందిన నాదిర్ షా నక్వి.
** మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రైల్వే రాడగంబాల బస్తీకి చెందిన నాదిర్ షా నక్వి సింగరేణిలో కొంతకాలం క్లర్క్ గా పని చేశారు. ఆయనది మతాంతర వివాహం. ఉద్యోగం చేస్తూనే సమాజంలో మూఢనమ్మకాలపై ప్రజలకు నిత్యం అవగాహన కల్పించారు. పదవీ విరమణ అనంతరం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తున్నాడు. పదవి విరమణ చేసిన తర్వాత హైదరాబాదులో కొంతకాలం స్థిరపడి పాటలు పాడడం నేర్చుకున్నాడు. హజారే పాటలను అద్భుతంగా పాడగలడు. అమ్మాయి బొమ్మతో పాటలు పాడుతూ ఆకట్టుకుంటున్నారు. ఈయన పాటలు వింటే మంత్ర ముగ్దులు కావలసిందే. పర్యావరణ పరిరక్షణ కోసం నిత్యం పరితపిస్తూ ఉంటాడు. ఇంటి ఆవరణలో పండ్ల మొక్కలతో పాటు ఇతర మొక్కలను పెంచుతున్నారు. పక్షుల అంటే ప్రాణం. గతంలో రకరకాల పక్షులు పెంచేవాడు . ఇతను కడక్ నాథ్ కోళ్లను పెంచుతున్నారు. పట్టణంలో వృథా చేసిన వస్తువులు తీసుకు వచ్చి కోళ్ల షెడ్డులో వినియోగించాడు. తోటలో పచ్చి గడ్డిని మేతగా వేస్తుంటారు. తొలి మలి విడత తెలంగాణ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. రాలేగావ్ సిద్ధిలో అన్నా హజారే చేసిన దీక్షలో ఆయనతోపాటు పాల్గొన్నారు. ఎఎంసి మైదానంలో ప్రతి రోజు సైకిల్ మీద డబ్బలతో నీళ్లను తీసుకువచ్చి మొక్కలకు ఉదయాన్నే పోస్తూ ఉంటారు. మైదానంలో తనకంటూ గుర్తింపుగా కొన్ని మొక్కలను పెంచుతున్నారు. శాసనసభ, లోక్ సభ ఎన్నికల్లో అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్రమంతా తిరిగాడు. డబ్బులు తీసుకుని ఓటు వేయవద్దని ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు.

Body:బైట్
నాదిర్ షా నక్వి

Conclusion:బెల్లంపల్లి
Last Updated : Dec 10, 2019, 11:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.