మంచిర్యాల జిల్లాలో 60 మంది ఉపాధ్యాయులను జైపూర్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మంచిర్యాల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు ఉపాధ్యాయులు వెళ్తున్నారు. ప్రాజెక్టు నిర్వాసితుల వద్దకు వెళ్తున్నారనే సమాచారంతో పోలీసులు అడ్డుకున్నారు. రెండ్రోజులు మంచిర్యాలలో రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులకు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్‌కు చెందిన ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఇవాళ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తుండగా రసూల్‌పల్లి వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 60 మందిని జైపూర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉపాధ్యాయుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పోలీసుల చర్యను డీటీఎఫ్ రాష్ట్ర నేతలు ఖండించారు.
ఇవీ చూడండి: సార్వత్రిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం