మంచిర్యాల జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలల కష్టాలు కొనసాగుతున్నాయి. సింగిల్ టీచర్ స్కూలు కావడం వల్ల అత్యవసర సమయాల్లో ఉపాధ్యాయులు సెలవు పెడితే ఆ పాఠశాలలో బోధించే వారే లేక పిల్లలు కూడా సెలవు తీసుకుంటున్నారు. జిల్లాలోని బెల్లంపల్లి పట్టణం శాంతిఖని ప్రాథమిక పాఠశాలలో సోమవారం... అత్యవసరం పడి ఉపాధ్యాయురాలు స్నేహలత సెలవు పెట్టింది. పాఠశాలకు వచ్చిన విద్యార్థులు టీచర్ లేక చాలా సేపు ఖాళీగా కూర్చున్నారు.
కొంతమంది తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకు వెళ్లారు. ఇంగ్లీష్ మీడియం ప్రారంభించారని పిల్లలను బడికి పంపిస్తే... టీచర్లు లేక బోధన సరిగా జరగడంలేదని తల్లిదండ్రులు వాపోయారు. సింగిల్ టీచర్ పాఠశాలల్లో కనీసం విద్యా వాలంటీర్లను అయినా నియమించాలని కోరుతుతున్నారు. గతేడాది 13 మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రారంభించడంతో 27కు చేరింది.
ఇవీ చూడండి: పసికందు దేహంతో పీఎస్కు మహిళ.. భర్తపై ఫిర్యాదు