ETV Bharat / state

Sticker for vehicle: ఈ-చలాన్​లు కట్టాల్సి వస్తుందని ఏం చేశారో తెలుసా! - mancherial district latest news

ట్రాఫిక్​ రూల్స్ ఎవరికైనా ఒకటే. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానాలు తప్పవు. అది అధికారుల వాహనమైనా.. సామాన్యుల వాహనమైనా చలాన్​ కట్టాల్సిందే. ఇలాగే అధిక వేగంతో వెళ్తూ స్పీడ్​గన్​కు చిక్కి ఈ-చలాన్​లు కట్టాల్సి వస్తుందని ఓ ఉన్నతాధికారి వాహనానికి ఏం చేశారో తెలుసా!

ఈ-చలాన్​లు కట్టాల్సి వస్తుందని ఏం చేశారో తెలుసా!

author img

By

Published : Jun 3, 2021, 9:57 AM IST

మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్​ వాహనానికి నిబంధనలకు విరుద్ధంగా స్టిక్కర్​ అతికించారు. ఈ-చలాన్​ల నుంచి తప్పించుకోవడానికి నెంబర్​ ప్లేట్​పై అదనపు పాలనాధికారి అని రాసి ఉన్న స్టిక్కర్​ వేశారు.

జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు మంచిర్యాల నుంచి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు వెళ్లినప్పుడు అధిక వేగం కారణంగా స్పీడ్​ గన్​కు చిక్కుతున్నారు. ఫలితంగా పోలీసులు ఈ-చలాన్​ ద్వారా జరిమానాలు విధిస్తున్నారు.

ఈ క్రమంలోనే అదనపు కలెక్టర్​ ఉపయోగించే వాహనానికి ముందు భాగంలో అదనపు పాలనాధికారి అని బోర్డు రాసి పెట్టారు. వెనుక భాగంలో నెంబర్​ ప్లేట్​పై స్టిక్కర్ అతికించారు. దీంతో సాధారణ ప్రజలకు వర్తించే నిబంధనలు అధికారులకు వర్తించవా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

ఇదీ చూడండి: అధునాతన లైట్లతో కాంతులీనుతోన్న యాదాద్రి ఆలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.