పదకవితా పితామహులు, తొలి వాగ్గేయకారులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్య 518వ వర్ధంతి ఉత్సవాలు మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో ఘనంగా జరిగాయి. స్థానిక రాధాకృష్ణ మందిర్‌లో చెన్నూర్ వికాస తరంగిణి శాఖ, శ్రీనివాస భజన మండలి, విశ్వకర్మ భజన మండలి సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా అన్నమయ్య జీవిత విశేషాలు, అతని గొప్పతనాన్ని కవి, గాయకులు, ఆధ్యాత్మికవేత్త కట్ల శ్రీనివాసాచార్యులు భక్తులకు వివరించారు. అనంతరం అన్నమాచార్య కీర్తనలను ఆలపించారు. అకినపెళ్లి మహేశ్ విశ్వకర్మ వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమంలో అకినపెళ్లి నాగన్న విశ్వకర్మ, పెండ్యాల, మంజుల, సత్యనారాయణ, ప్రియా, రామచంద్రం, విజయ్, చంద్రశేఖర్, హరిదాసు బుచ్చన్న విశ్వకర్మ, రవీందర్, తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో గురువారం ఒక్కరోజే లక్ష కరోనా పరీక్షలు: డీహెచ్