ETV Bharat / state

అబ్బురపరిచిన స్పేస్​ ఆన్​ వీల్స్ - అబ్బురపరిచిన స్పేస్​ ఆన్​ వీల్స్

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఏఎంసీ మైదానంలో ఇస్రో ఎన్​ఆర్​ఎస్​సీ ఆధ్వర్యంలో చేపట్టిన స్పేస్​ ఆన్​ వీల్స్​ కార్యక్రమం వీక్షకులను అబ్బురపరిచింది.

space on wheels program at bellampally in mancherial
అబ్బురపరిచిన స్పేస్​ ఆన్​ వీల్స్
author img

By

Published : Feb 14, 2020, 4:10 PM IST

అబ్బురపరిచిన స్పేస్​ ఆన్​ వీల్స్

భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్​ సారాభాయి 100వ జయంతి పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏఎంసీ మైదానంలో స్పేస్​ ఆన్​ వీల్స్​ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు.

ఇస్రో ఎన్​ఆర్​ఎస్​సీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర ద్వారా అంతరిక్ష విశేషాలు వివరించారు. రాకెట్​ ప్రయోగాలు, శాటిలైట్ లాంచ్​ షాట్స్, ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నమూనాలు ప్రదర్శించారు. రాకెట్లు ఆకాశంలో ఎలా దూసుకెళ్తాయో విద్యార్థులకు వివరించారు.

ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ మండలాల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. విజ్ఞాన విశేషాలను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.