ETV Bharat / state

సింగరేణిలో లాభాల వెలుగులు - BOGGU GANULU

ఎన్నో ఏళ్లుగా నష్టాల బాటలో నడిచిన మందమర్రి సింగరేణి... లాభాల బాట పట్టింది. మూడు నెలల కాలంలోనే రూ.45 కోట్ల లాభం తీసుకొచ్చి కార్మికుల్లో ఆనందం నింపింది.

సింగరేణిలో లాభాల వెలుగులు
author img

By

Published : Mar 20, 2019, 12:30 PM IST

సింగరేణిలో లాభాల వెలుగులు
50 ఏళ్లగా నష్టాల బాటలో నడిచిన మందమర్రి ఏరియా సింగరేణి బొగ్గు గనులు లాభాల బాట పట్టడం హర్షణీయమని ఏరియా జీఎం రాఘవులు తెలిపారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే 5 గని వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 12 రోజులు ముందుగానే చేరుకోవడంతో గని ఆవరణలో సంబురాలు జరుపుకున్నారు. సత్తా చాటిన కార్మికులను, ఉద్యోగులను జీఎం అభినందించి... నగదు పంపిణీ చేశారు. గడిచిన మూడు నెలల్లో 45 కోట్ల రూపాయల లాభం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు.

Intro:tg_adb_21_19_ samburalu_avb_c2

Body: లాభాల బాటలో మందమరి ఏరియా సుమారు 50 ఏళ్లుగా నష్టాల బాటలో పయనించిన మందమరి ఏరియా సింగరేణి బొగ్గు గనులు గత మూడు నెలలుగా లాభాల బాటలో పయనించడం ఆనందంగా ఉందని మందమరి ఏరియా జిఎం రాఘవులు అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని కేకే 5 గని వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యం 12 రోజులు ముందుగానే చేరుకోవడం పట్ల ఈరోజు గని ఆవరణలో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సత్తా చాటిన కార్మికులను ఉద్యోగులను జిఎం రాఘవులు అభినందించారు. వారికి నగదు తో పాటు మిఠాయిలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడు నెలలుగా 45 కోట్లు లాభం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని పిలుపునిచ్చారు. byte. జిఎం రాఘవులు

Conclusion:ఈటీవీ పరిశీలించగలరు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.