మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఐసోలేషన్ కేంద్రంలో ఉన్న ముగ్గురు కొవిడ్-19 అనుమానితులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. దీంతో అక్కడ విధులు నిర్వర్తించిన పారిశుద్ధ్య సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
తమకు కనీస రక్షణ పరికరాలు అందజేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీపీఈ కిట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. భయాందోళనల నడుమ పని చేయాల్సి వస్తున్నదని అందోళన చెందుతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమకు రక్షణ పరికరాలు అందించాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: అమ్మా.. నీ మనసు వెన్న...