ETV Bharat / state

ఆర్టీసీ డిపో కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా - ఆర్టీసీ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు కార్మికులు మధ్యాహ్న భోజన సమయంలో ఆందోళనకి దిగారు.

ఆర్టీసీ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా
author img

By

Published : Sep 23, 2019, 5:46 PM IST

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు మధ్యాహ్న భోజన సమయంలో ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు పడుతున్న సమస్యలపై అన్ని సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చి ఐక్యంగా పోరాటం చేస్తున్నామని కార్మిక నాయకులు తెలిపారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని 2017 ఏప్రిల్ వేతన సవరణ అమలు చేయాలని, డీజిల్ పై పెరుగుతున్న భారాన్ని ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. వెంటనే అద్దె బస్సులను రద్దు చేసి కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరారు.

ఆర్టీసీ కార్యాలయం ఎదుట కార్మికుల ధర్నా

ఇవీ చూడండి: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ

Intro:TG_ADB_12_23_RTC EMPLOYEES DARNA_AV_TS10032

Body:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాష్ట్ర రవాణా సంస్థ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన సమయంలో ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులు పడుతున్న సమస్యలపై అన్ని సంఘాలు ఒక్కతాటిపైకి వచ్చి ఐక్య సంఘాలుగా ఏర్పడి పోరాటం చేస్తున్నామని కార్మిక నాయకులు తెలిపారు.
ఎన్నికల ముందు కెసిఆర్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని 2017 ఏప్రిల్ వేతన సవరణ అమలు చేయాలని, డీజిల్ పై పెరుగుతున్న భారాన్ని ప్రభుత్వమే భరించాలి. అద్దె బస్సులను రద్దు చేసి కొత్త బస్సులను కొనుగోలు చేసి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు...

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.