ETV Bharat / state

'నడిరోడ్డుపై ఎమ్మెల్యే గూండాగిరి చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా..?' - మందమర్రి టోల్​ప్లాజా వద్ద ఉద్రిక్తత

RS Praveen Kumar reaction on MLA Chinnaiah incident : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తీరు వివాదస్పదమైంది. ఓ టోల్‌ప్లాజా వద్ద పనిచేస్తున్న సిబ్బందిపై ఆయన చేయిచేసుకున్నారు. ఈ దాడి ఘటనను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. ట్విటర్ వేదికగా ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించారు.

RS praveen kumar fires on BRS MLA
RS praveen kumar fires on BRS MLA
author img

By

Published : Jan 4, 2023, 1:57 PM IST

RS Praveen Kumar reaction on MLA Chinnaiah incident: మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్ ప్లాజా సిబ్బందిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడిని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. బీఆర్​ఎస్​పై మరోమారు ఆర్ఎస్ ప్రవీణ్ ధ్వజమెత్తారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే చిన్నయ్యపై ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎమ్మెల్యే చిన్నయ్య గుండాగిరి చేస్తూ టోల్ ప్లాజా సిబ్బందిని కొట్టడమేంటని ప్రశ్నించారు. కేసీఆర్​ హఠావో తెలంగాణ బచావో అంటూ ట్వీట్ చేశారు.

  • మందమర్రి చేసి గేట్ సిబ్బందిని కొడుతున్న ⁦@BRSparty⁩ MLA? ఇంత ఓపెన్ గా గన్ మెన్ల పహారాలోనే గూండాగిరి జరుగుతూ ఉంటే ఎట్ల చూస్తూ ఊరుకోవాలి. #KCR కో హఠావో, తెలంగాణకో బచావో. pic.twitter.com/UcAeGIx1YJ

    — Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) January 4, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మంగళవారం అర్ధరాత్రి మంచిర్యాల జిల్లా మందమర్రి టోల్​ప్లాజా వద్ద ఉద్రిక్తత నెలకొంది. టోల్​ సిబ్బందిపై బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య దాడి చేశారు. మంచిర్యాల వైపు నుంచి బెల్లంపల్లి వెళ్తున్న సమయంలో టోల్​ప్లాజా వద్ద సిబ్బంది ఎమ్మెల్యే కారును ఆపారు. ఈ క్రమంలో అక్కడ చిన్న గొడవ చోటుచేసుకోవడంతో టోల్ సిబ్బందిని ఎమ్మెల్యే చెంప దెబ్బ కొట్టిన సంగతి తెలిసిందే.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.