రూపాలు వేరైనా భగవంతున్ని చేరుకునే మార్గమే భక్తి. ప్రతి ఒక్కరిలోనూ దేవుడున్నాడని నమ్మే మనిషి ఆ నమ్మకానికి ఓ రూపమిచ్చి.. భగవంతుని స్వరూపంగా భావించి చేసుకునే వేడుకలే పండుగలు. తాము పూజించే దేవుడి రూపాలు వేరైనా.. ఆచరించే మతాలు వేరైనా సోదరభావంతో కలిసిపోయి వేడుకలు నిర్వహించుకుంటున్నారు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెంకటాపూర్ వాసులు.
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు ఈ గ్రామస్థులు. ఒకే మాసంలో వచ్చిన గణపతి నవరాత్రులు, మొహర్రం పండుగలను కలిపి జరుపుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతే కాదు పక్కపక్కనే వినాయక ప్రతిమ, పీర్లు ప్రతిష్ఠించి మతసామరస్యాన్ని చాటుకుంటున్నారు. పీర్ల పండగాలో భాగంగా ఏర్పాటు చేసిన అగ్ని గుండం చుట్టూ గ్రామస్థులంతా నృత్యాలు చేస్తుంటారు. ఆ సమయంలో వినాయకుడి వద్ద ఉన్న స్పీకర్లు ఆపేస్తారు. మతం ఏదైనా తామంతా మనుషులమే అంటూ సోదరభావంతో కలిసి మెలిసి పండుగ చేసుకోవడం సంతోషంగా ఉందంటున్నారు గ్రామస్థులు.
ఇవీచూడండి: 1984 అల్లర్లు: కమల్‌నాథ్‌ను వీడని చిక్కులు!