ప్రమాదవశాత్తూ రెండు కాళ్లను కోల్పోయిన మంచిర్యాల జిల్లాకు చెందిన ఓ యువకుడికి కృత్రిమ కాళ్లు ( ఎలక్ట్రికల్ లింబ్స్) అమర్చుకునేందుకు ప్రభుత్వం సీఎం సహాయక నిధి నుంచి నిధులు మంజూరు చేసింది. అందుకు సంబంధించిన ఎల్ఓసీ పత్రాన్ని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారునికి అందజేశారు.
జిల్లాలోని మందమర్రి గ్రామానికి చెందిన కుమ్మరి సురేష్ (34) ప్రమాదవశాత్తూ రెండు కాళ్లు కోల్పోయారు. అతడికి కృత్రిమ కాళ్లు అమర్చేందుకు సాయం చేయాల్సిందిగా అతని కుటుంబ సభ్యులు రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు విన్నవించుకున్నారు. ఈ విషయమై స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు పంపారు. సీఎంఆర్ఎఫ్ నుంచి మంజూరైన రూ. 2.5 లక్షలకు సంబంధించిన ఎల్ఓసీ పత్రాన్ని మంత్రి తన క్యాంపు కార్యాలయంలో సురేష్‌కు అందజేశారు.
ఇదీ చదవండి: ఉద్యోగాల భర్తీలో స్పష్టత లేదు: జీవన్ రెడ్డి