ముస్లింల పవిత్ర పండగ రంజాన్‌ను ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో మంచిర్యాల జిల్లా కేంద్రంలో తోఫా సేమియా కిట్లను పంపిణీ చేశారు. పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిని శ్యామలాదేవి 150 మంది ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందించారు.
లాక్డౌన్ కారణంగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ముస్లిం చిరు వ్యాపారులకు తమ వంతు సాయంగా స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలను శ్వామలాదేవి అభినందించారు. కరోనా మహమ్మారిని అరికట్టడం కోసం ప్రతి ఒక్కరు స్వీయ నిర్బంధంతో పాటు భౌతిక దూరం పాటించాలని సూచించారు.