తాగునీటి సమస్యలు తీర్చాలంటూ మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలంలోని వీగాం గ్రామంలో మహిళలతో పాటు గ్రామస్థులు బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాగునీరు సరఫరా చేయాలని సర్పంచ్‌తో పాటు అధికారులకు మొరపెట్టుకున్నా వారు స్పందించడం లేదని ఆరోపించారు.
ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి అక్కడకు చేరుకుని గ్రామస్థులతో మాట్లాడారు. రెండు రోజల్లో వీటి సమస్య తీరుస్తామని సర్పంచ్ హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.
ఇదీ చూడండి: కూతురిని చంపేసి.. నాలుక కోసి తినేసింది