ఎగువ నుంచి వస్తోన్న వరద నీటి ప్రవాహంతోపాటు మేడిగడ్డ ప్రాజెక్టు గేట్లు మూసివేయడం వల్ల ప్రాణహిత నది ఉప్పొంగుతోంది. వేమనపల్లి మండలంలోని ముల్కల పేట, రాచర్ల గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాచర్ల గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
కోటపల్లి మండలంలోని వెంచపల్లి, జనగామ, అల్గామా, పుల్లగామ, సూపాక, దేవులవాడ, అర్జునగుట్ట, అన్నారం, నందరాం పల్లి గ్రామాల్లో 5000 ఎకరాల్లో పత్తి పంట నీట మునిగింది. అలాగే వేమనపల్లి మండలంలోని ముల్కలపేట, జాజుల పేట, రాచర్ల గ్రామాలో ఐదు వందల ఎకరాలల్లో పత్తి నీటిపాలైంది. ఆదివారం రాత్రి నుంచి ప్రవాహ ఉద్ధృతి పెరగడం వల్ల ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇదీ చదవండి: 'కొవాగ్జిన్' రెండోదశ ప్రయోగానికి ఏర్పాట్లు