లాక్డౌన్లో విద్యార్థులు చదువుకునేలా గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించారు. ఉపాధ్యాయులు తమ పాఠశాలల్లో చదివే విద్యార్థుల చరవాణి నంబర్లు తీసుకుని వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. అందులోనే సందేహాలను నివృత్తి చేస్తున్నారు. గురుకులాల సంస్థ ఓక్స్ యాప్‌ను తీసుకువచ్చింది. ఈ యాప్‌తో ఇప్పటికే బోధన కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లాలో 63శాతం విద్యార్థులు ఆన్‌లైన్‌లో పాఠాలు వింటున్నారు.
అన్ని తరగతులకు కామన్ సిలబస్
ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు గురుకులాల సంస్థ కామన్ సిలబస్‌ను లాక్‌డౌన్ సమయంలో రూపొందించింది. ఆరు నుంచి తొమ్మిది వరకు ఒక అంశాన్ని తీసుకుని పాఠాలను బోధిస్తున్నారు. ఉదాహరణకు విద్యుత్తు పాఠం ఉంటే పైతరగతి వరకు అంతా కలిపి బోధన చేస్తున్నారు. ఉపాధ్యాయులకు సమయం వృథా కాకుండా ఉంటుంది. విద్యార్థులకు అదనపు జ్ఞానం లభించినట్లు అవుతుంది. చరవాణి లేని విద్యార్థులు టీ-శాట్‌తో పాఠాలు వింటున్నారు. ఇవీ రెండు అందుబాటులో లేకపోతే విద్యార్థులను చదువుకోమని ఉపాధ్యాయులు ఫోన్లు చేస్తున్నారు. ప్రతిరోజు నాలుగు అంశాలు(సబ్జెక్టులు) బోధిస్తున్నారు.
ఆదర్శంగా బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ పాఠశాల
గురుకులాల సంస్థ ప్రవేశపెట్టిన యాప్, టీశాట్‌కు భిన్నంగా సాంఘిక సంక్షేమ గురుకులాల పాఠశాల ప్రిన్సిపల్ ఐనాల సైదులు వినూత్నంగా ఆలోచించి వెబ్‌నార్‌తో ఇంటర్ విద్యార్థులకు పాఠాల బోధన జరిగేలా చూశారు. ఆయా విషయాలు అధ్యాపకులందరినీ సమాయాత్తం చేసి సాంకేతికతను సద్వినియోగం చేసుకుని ఎంసెట్, నీట్ శిక్షణ కొనసాగిస్తున్నారు. ఈ పాఠశాల విద్యార్థుల హాజరు శాతం 85 వరకు ఉంటుంది.
ముందుచూపుతో విద్యార్థులకు బోధన
లాక్‌డౌన్ కాలంలో విద్యార్థులకు నష్టం జరగకుండా గురుకులాల సంస్థ కార్యదర్శి ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ ముందుచూపుతో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభించారు. విద్యార్థులను సాంకేతికత సాయంతో ఒక దగ్గరికి చేర్చి బోధన చేయగలుగుతున్నాం. విద్యార్థులకు పాఠాలు బోధించడమే తమ ప్రథమ కర్తవ్యంగా భావిస్తున్నాం. విద్యార్థులు చక్కగా సహకరిస్తున్నారు.
- జూపూడి ఏంజల్, ప్రాంతీయ సమన్వయకర్త, గురుకులాల సంస్థ
- జిల్లాలోని సాంఘిక సంక్షేమ పాఠశాలల సంఖ్య- 10
- మొత్తం విద్యార్థులు: 6 వేలు
- బోధన సమయం: ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు