నీళ్ల ట్యాంకు ఎక్కి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం ముల్కల గ్రామంలో జరిగింది. కుటుంబ సమస్యలతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు బెదిరిస్తూ గ్రామానికి చెందిన రత్నం అనే యువకుడు కాసేపు హల్చల్ చేశారు.
విషయంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుని కిందకు దించే ప్రయత్నం చేశారు. అయినా అతను నిరాకరించడంతో చివరికి సర్పంచ్ శ్రీనివాస్ హామీతో అతను తన ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. దీంతో గ్రామస్థులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.