మంచిర్యాల పురపాలక సంఘం ఎన్నికల్లో నామపత్రాల దాఖలు రెండో రోజు కొనసాగింది. 36 వార్డులకు చెందిన తెరాస, కాంగ్రెస్, భాజపా, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు.
అభ్యర్థితో పాటు ఇద్దరు ప్రతినిధులను మాత్రమే కేంద్రంలోకి అనుమతించారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రం వద్ద పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులతో వచ్చిన పార్టీ కార్యకర్తలను రెండొందల మీటర్ల దూరంలోనే నిలిపివేశారు.
మంచిర్యాల పురపాలికలో నామపత్రాల స్వీకరణ ప్రక్రియ సజావుగా సాగుతోందని మున్సిపల్ కమిషనర్ స్వరూప తెలిపారు.
- ఇదీ చూడండి: ఏసీబీ వలలో జూబ్లీహిల్స్ ఎస్సై..