మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయీ జయంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన నగదును భారత ప్రభుత్వం మంజూరు చేస్తోందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు తెలిపారు. దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మంది రైతులకు రూ.2000 చొప్పున 18 కోట్లను లబ్దిదారుల ఖాతాల్లో వేయనున్నట్లు పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలో సాగు చట్టాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఎంపీ పాల్గొన్నారు.
సదస్సులో వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రతిపక్షాలు వ్యవసాయ చట్టాలపై అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. రైతులకు జరిగే నష్టాల గురించి ఇప్పటివరకు ప్రతిపక్షాలు వివరించలేదన్నారు. నూతన చట్టాలతో రైతులకు ఎంతో లాభం జరుగుతుందని తెలిపారు.
కిసాన్ సమ్మాన్ నిధిపై ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన వర్చువల్ మీటింగ్‌లో వివిధ రాష్ట్రాల్లోని రైతులతో సమావేశమైన ప్రసారాలను.. రైతులు టీవీ ద్వారా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశారు. దేశంలో రైతేరాజు కావాలనే ఉద్దేశంతో మోదీ సంస్కరణలు తీసుకువస్తున్నారని ఎంపీ సోయం బాపురావు తెలిపారు.
ఇదీ చూడండి: వాజ్‌పేయీ సేవలు మరువలేనివి: కిషన్ రెడ్డి